హౌసింగ్ సొసైటీ పర్మిషన్ కు రూ.8కోట్ల లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన లిక్విడేటర్

హౌసింగ్ సొసైటీ పర్మిషన్ కు రూ.8కోట్ల లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన లిక్విడేటర్

ఇటీవల లంచం ఓ అలవాటు మారింది అవినీతి అధికారులకు.చిన్నపాటి ఉద్యోగులనుంచి ఉన్నతాధికారుల వరకు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. వందలకు వేలు కాదు ఏకంగా కోట్లలో లంచాలు తింటున్నారు. లంచావతారులు పెరిగిపోతుండటంతో ఏసీబీ గట్టి నిఘా పెట్టి అవినీతి అధికారులు భరతం పడుతున్నారు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ అవినీతి తిమింగలాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా  ఫూణేలో ఓ హౌసింగ్ సొసైటీ పర్మిషన్ల కోసం రూ. 8కోట్ల లంచం డిమాండ్ చేసిన గవర్నమెంట్ నియమించిన లిక్వేడేటర్ తోపాటు మరో కాంట్రాక్టు ఆడిటర్ ను  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

ఓ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. మొదటి ఇన్ స్టాల్ మెంట్ గా రూ. 30లక్షలు తీసుకుంటుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల్లో లిక్విడేటర్ వినోద్ మాణిక్‌రావ్ దేశ్‌ముఖ్ (50)  ప్రభుత్వం నియమించిన అధికారిగా, చార్టర్డ్ ఆడిటర్ భాస్కర్ రాజారామ్ పోల్ (56)గా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ గా గుర్తించారు. 

ఏంజరిగిందంటే.. 

పూణెలోని ధనక్వాడిలోని ఏక్తా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కొత్త సభ్యుడు అయిన బాధితుడు ఓ వ్యాపారవేత్త. 2005లో అసలు సభ్యుల నుండి 32 మంది కొత్త సభ్యులు షేర్ సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు.2020లో సభ్యత్వ వివాదం కారణంగా కోఆపరేటివ్ సొసైటీ  ర్వాహకుడిని నియమించింది. అతను తరువాత సొసైటీని రద్దు చేయాలని సిఫార్సు చేశాడు.

ఆ తరువాత 2024లో నిందితుడు దేశ్‌ముఖ్‌ను లిక్విడేటర్‌గా నియమించారు. 2023లో షేర్ సర్టిఫికెట్ల జారీ కోసం బాధితుడు అప్పటి నిర్వాహకుడు రాజారామ్ పోల్ ను సంప్రదించగా ..32 మంది కొత్త సభ్యుల దరఖాస్తులను క్లియర్ చేశాడు కానీ ఫిర్యాదుదారుడి దరఖాస్తును పెండింగ్‌లో ఉంచాడు.

సెప్టెంబర్ 2025లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుకు సంబంధించి ఫిర్యాదుదారుడు పోల్‌ను మరోసారి సంప్రదించగా తనకు ,లిక్విడేటర్ దేశ్‌ముఖ్‌కు రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు ఏసీబీ అధికారులు. అదనంగా భవిష్యత్తులో జరిగే వేలం ప్రక్రియలో ఫిర్యాదుదారు ఇష్టపడే బిడ్డర్‌కు సొసైటీ భూమి లభించేలా చేసేందుకు  మరో రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. దీని ప్రకారం మొత్తం లంచం మొత్తం రూ.8 కోట్లుగా డిమాండ్ చేశారు.

ఈ విషయంపై బాధితుడు డిసెంబర్ 5న అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో ACB బృందం రంగంలో దిగడంతో అవినీతి బయటపడింది. లంచంగా రూ. 8 కోట్లు డిమాండ్ చేసి.. మొదటి ఇన్ స్టాల్ మెంట్ గా రూ. 30లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా నిందితులిద్దరిని పట్టుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.