ఎంత పని చేశావ్.. ధోనీని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్‌

ఎంత పని చేశావ్.. ధోనీని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్‌

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఏ విషయమైనా.. సోషల్ మీడియాలో వాలితే వైరల్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. విజయాలు వస్తే పొంగిపోవడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం మహేంద్రుడిలో ఏమాత్రం కనిపించవు. అదే కోట్లాది మంది అభిమానులకు తనను చేరువచేసింది. అలాంటి ధోని కళ్ల ముందు కనిపిస్తే ఫోటో దిగాలని ఎవరికీ అనిపించదు చెప్పండి. కాకుంటే ఓ ఎయిర్‌హెస్టెస్ చేసిన చిలిపి పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

ధోనీని దొంగచాటుగా వీడియో  

ధోని విమానంలో నిద్రపోతుండగా.. ఎయిర్‌హోస్టెస్‌ అతన్ని దొంగచాటుగా వీడియో తీసింది. ధోని పక్క సీట్లో అతని భార్య సాక్షి కూడా ఉండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. తన అభిమాన ఆటగాడిని చూడగానే ఎయిర్‌హోస్టెస్‌ మొహం సంతోషంలో వెలిగిపోయింది. అతన్ని డిస్టర్బ్‌ చేయడం సరికాదు అనుకుందేమో.. పక్కన నిల్చొని ఫోటో తీసుకొని మురిసిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ఎయిర్‌హోస్టెస్‌ మొహంలో సంతోషం 

ఎయిర్‌హోస్టెస్ సంతోషాన్ని చూసి ఆనందపడేవారు కొందరైతే, విమర్శించేవారు మరికొందరు. ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించేలా వీడియోలు తీయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ధోని వంటి వ్యక్తి మన కళ్ల ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆనందం వర్ణించలేని విధంగా ఉంటుందని ఆమెకు మద్దతిస్తున్నారు.