
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది ఎయిర్ ఇండియా కంపెనీ. శనివారం (జులై 27) 25 లక్షల పరిహారాన్ని విడుదల చేసింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ (జులై 27) 166 మంది కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారాన్ని రిలీజ్ చేసింది.
జూన్ 12న గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తర్వాత తక్షణ సాయంగా 25 లక్షలు ఇచ్చిన టాటా గ్రూప్.. లేటెస్ట్ గా మధ్యంతర పరిహారం కింద ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందించనుంది. మృతుల కుటుంబాల ఆర్థిక అవసరాల దృష్ట్యా 25 లక్షల రూపాయలు పరిహారాన్ని మధ్యంతర సాయంగా అందించనున్నట్లు పేర్కొంది.
ప్రమాదం జరిగిన తర్వాత AI-171 మెమోరియల్, వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది టాటా గ్రూప్. బాధిత కుటుంబాలకు ఈ ట్రస్టు కింద కోటి రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా శనివారం (జులై 26) రూ.25 లక్షల సాయాన్ని విడుదల చేసింది.
భారత విమానయాన రంగంలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 క్రాష్ ప్రమాదంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ప్రమాద సమయంలో ఉన్నారు. అయితే ఇందులో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డాడు.
ఇదే క్రమంలో క్రాష్ అయిన ప్రాంతంలో మరో 19 మంది ప్రాణాలను కోల్పోయినట్లు వెల్లడైంది. అలాగే 60 మంది వరకు విమానం కూలిన ప్రాంతం చుట్టుపక్కల గాయపడ్డారు. విమానం కూలినప్పుడు 15 వందల డిగ్రీల వరకు మంటలు రావటంతో మృతుల డీఎన్ఏ సేకరించటం పరీక్షించటం కూడా కష్టంగా మారింది.