ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం: వరుసగా 20 వాహనాలను ఢీకొట్టిన ట్రక్.. ఒకరు స్పాట్ డెడ్

ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం: వరుసగా 20 వాహనాలను ఢీకొట్టిన ట్రక్.. ఒకరు స్పాట్ డెడ్

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్ అదుపు తప్పి 20 నుంచి 25 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం (జూలై 26) రాయ్‌గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకా ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అదోషి సొరంగం సమీపంలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. ట్రక్ సృష్టించిన బీభత్సానికి ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 20 నుంచి 25 వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.

ALSO READ | పిల్లలు చచ్చిపోయిన మీరు మారరా..? రాజస్థాన్‎లో కూలిన మరో ప్రభుత్వ పాఠశాల పైకప్పు

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు చెల్లాచెదురుగా పడటంతో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. కంటైనర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పోలీసులు తెలిపారు.

ట్రక్ 20 నుంచి 25 వాహనాలను ఢీకొట్టిందని వాటిలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయని చెప్పారు. ట్రక్ డ్రైవర్‎ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డ్రైవర్‎కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయగా.. అతడు మద్యం సేవించలేదని తేలిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.