
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే క్రాష్ అయింది. విమానంలో మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ‘ఎక్స్’లో కనిపించాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానంగా తెలిసింది.
Major tragedy. Air India passenger aircraft crashes in Meghani of Ahemdabad of Gujarat while take off. More details are awaited. pic.twitter.com/5Kqs01cBqk
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025
అహ్మదాబాద్‌లోని మేఘాని సమీపంలో ఈ విమానం క్రాష్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం క్రాష్ అవడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. విమాన ప్రమాదాలు ఇటీవల కలవరపెడుతున్నాయి. టేకాఫ్ అయి గాల్లో ఎగురుతుండగా చెట్టును ఢీకొట్టి విమానం కూలినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆసుపత్రికి తరలించాయి.
#BREAKING
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) June 12, 2025
Plane crashes at Ahmedabad Airport...
An Air India plane crashed in Ahmedabad.
The accident happened during takeoff #AirIndia #planecrash pic.twitter.com/7FtnQLBdA8