
Air India plane crash: దాదాపు 37 ఏళ్ల తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా నేడు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన క్రాష్ నిలిచింది. గతంలోనే బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలపై విజిల్ బ్రోవర్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే మెుత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు 171 మందికి పైగా ప్రయాణికులు మృతి చెంది ఉంటారని ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలో అసలు విమాన ప్రమాదంలో మరణిస్తే లేగా గాయపడితే ఎలాంటి పరిహారం లభిస్తుందనే విషయాలు చాలా మందికి తెలియవు. విమానయాన సంస్థ ఎలాంటి పరిహారం అందిస్తుంది, ఇన్సూరెన్స్ ఏమైనా వస్తుందా, పౌర విమానయాన శాఖ ఎలాంటి పరిహారం అందిస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విమానయాన సంస్థ బాధ్యత..
అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికులు మరణించినా లేక ప్రమాదంలో గాయపడినా భారతీయ ఎయిర్ లైన్ సంస్థలు మాంట్రియల్ కన్వెన్షన్1999 ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది.
Also Read : మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం
* దీని కింద మరణించిన ప్రయాణికులకు కారణంతో సంబంధం లేకుండా రూ.కోటి 55 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదానికి విమానయాన సంస్థ నిర్లక్ష్యం కారణమైతే ఈ మెుత్తం ఇంకా పెరగవచ్చు.
* ప్రమాద సమయంలో విమానయాన సంస్థ అందించే మెుత్తం కాకుండా ప్రయాణికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు. విమాన ప్రమాదాలకు ఇది వర్తిస్తుంది. విమాన ప్రమాదాలు వంటి అరుదైన కానీ విపత్కర సంఘటనలలో ప్రయాణ బీమా చాలా విలువైనది.
* సమగ్ర ప్రయాణ బీమా పథకాలు ప్రయాణికులను వివిధ రకాల ప్రమాదాల సమయంలో విస్తృతమైన కవరేజీని అందిస్తాయి. వీటిలో సాధారణంగా ప్రమాదవశాత్తు ట్రావెల్ చేస్తున్నప్పుడు మరణిస్తే రూ.25 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించబడుతుంది. అలాగే అంగవైకల్యానికి గురైతే రూ.10 లక్షల వరకు పరిహారం పొందుతారు.
* ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొందమంది వ్యక్తులకు వారి బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సంస్థలు కొన్నిసార్లు వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఎయిర్ ట్రావెల్ కవరేజ్ కూడా అందిస్తుంటాయి. వీటిని కూడా ప్రస్తుత ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఫ్యామిలీలు పొందటానికి వీలు ఉంటుంది.
ప్రతి ప్రయాణికుడు చేయవలసిన పనులు:
- విదేశీ ప్రయాణాలతో పాటు దేశీయ విమానాలకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనటం ఉత్తమం
- నామినీ వివరాలను స్పష్టంగా వెల్లడించండి
- ప్రమాదవశాత్తు మరణం + హెల్త్ కవర్ ఉన్న పాలసీలను ఎంచుకోండి
- పాలసీ పత్రాల డిజిటల్ & ఫిజికల్ కాపీలను భద్రపరచుకోండి.