
ప్రపంచం మొత్తం ఊపిరిబిగపట్టింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడుల తర్వాత.. అదే స్థాయిలో ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఎటాక్ మొదలుపెట్టింది ఇరాన్. డ్రోన్ బాంబులు, యుద్ధ విమానాలతో మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ దేశంపై ప్రయోగిస్తుంది ఇరాన్. రెండు దేశాలు నువ్వెంతెంత నెవ్వెంత అనే స్థాయికి వచ్చేశాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ అవుతున్నాయి.1980లో ఇరాక్, ఇరాన్ యుద్ధం తర్వాత.. ఇరాన్ దేశంపై ఈ స్థాయిలో దాడి జరగటం ఇదే..ఇజ్రాయెల్ దాడులను చాలా చాలా సీరియస్గా తీసుకున్న ఇరాన్.. యుద్ధానికి రెడీ అంటోంది. ఈ పరిణామాలతో.. ఇరాన్ దేశం వైపు నిలబడేది ఎవరు.. ఇజ్రాయెల్ వైపు ఉండేదు ఎవరు అనే చర్చ నడుస్తుంది.
అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 వైమానిక స్థావరాలు ఉన్నాయి.అది తన శత్రు దేశాలలో అశాంతిని వ్యాప్తి చేయడానికి తిరుగుబాటుదారులకు అన్ని రకాల సహాయం అందిస్తూనే ఉంది. ఉత్తర కొరియాను ఎదుర్కోవడానికి తైవాన్, దక్షిణ కొరియా ,రష్యాను చుట్టుముట్టడానికి ఉక్రెయిన్‌లకు చైనా సహాయం చేస్తోంది. అమెరికా తెరవెనుక నుండి ఈ దేశాలన్నింటికీ జీవితాన్ని కష్టతరం చేస్తోంది.
జూన్ 13వ తేదీ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్‌పై వరుస దాడులను ప్రారంభించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా మీడియా ముందుకు వచ్చి ట్రంప్‌కు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఇప్పుడు ఇజ్రాయెల్ పై కూడా అవతలి వైపు నుండి దాడి జరుగుతుందనే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీంతో ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఈ పరిస్థితిలో ఇవన్నీ చూసిన తర్వాత రష్యా చైనా కలిసి వస్తాయా అనే చర్చ తీవ్రమైంది.
ఇటీవల చైనాతో ఇరాన్ ఒప్పందం కూడా వెలుగులోకి వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట ప్రకారం..ఇరాన్ చైనాతో క్షిపణి ఇంధన ఒప్పందం చేసుకుంది. చైనా నుంచి వేల టన్నుల క్షిపణి ఇంధనాన్ని ఇరాన్ ఆర్డర్ చేసింది. అందులో బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే అమ్మోనియం పెర్ క్లోరేట్ కూడా ఉంది. ఇరాన్ ఈ ఇంధనంతో 800 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయొచ్చు.
►ALSO READ | ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ : ఇరాన్ పై దాడి ఎందుకు.. టార్గెట్స్ ఏంటీ..?
శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్ ప్రధాన అణు కేంద్రాన్ని లక్ష్యంగా దాడి చేసింది. దాడి తర్వాత ఆ అణు కేంద్రం నుండి గాలిలో నల్లటి పొగ పైకి లేచింది. ఇరాన్ పారామిలిటరీ దళం 'రివల్యూషనరీ గార్డ్' అధిపతి జనరల్ హుస్సేన్ సలామి ఇజ్రాయెల్ దాడిలో మృతిచెందారు. 1980లలో ఇరాక్‌తో జరిగిన యుద్ధం తర్వాత ఇరాన్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇది. దీనితో పశ్చిమాసియాలోని రెండు ప్రధాన ప్రత్యర్థుల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందనే భయాలు పెరిగాయి.
అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 వైమానిక స్థావరాలు ఉన్నాయి. అది తన శత్రు దేశాలలో అశాంతిని వ్యాప్తి చేయడానికి తిరుగుబాటుదారులకు అన్ని రకాల సహాయం అందిస్తూనే ప్రధాన ఆరోపణ.ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా తైవాన్, దక్షిణ కొరియా ,రష్యాను చుట్టుముట్టడానికి ఉక్రెయిన్‌లకు అమెరికా సహాయం చేస్తోంది. అమెరికా తెరవెనుక నుండి ఈ దేశాలన్నింటికీ జీవితాన్ని కష్టతరం చేస్తోంది. ఇప్పుడు చైనా ,రష్యా అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం భావిస్తున్నాయి. అరేబియాలో చురుకుగా ఉండబోయే కొత్త అణు త్రిభుజం మధ్యప్రాచ్యంలో అమెరికన్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది.
100కిపైగా క్షిపణులను ప్రయోగించారు..
ఇరాన్పై దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ పై డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది.ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అంగీకరించింది. 200 యుద్ద విమానాలతో ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ సైన్యం. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక గగన తలాన్ని మూసివేస్తూ జోర్డాన్ పౌర విమానయాన శాఖ ప్రకటన చేసింది. పెరుగుతున్న ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు చెబుతోంది జోర్డాన్ న్యూస్ ఏజెన్సీ.