అహ్మదాబాద్ విమాన ప్రమాదం..భర్తను కలిసేందుకు లండన్ వెళ్తూ..నవవధువు మృతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..భర్తను కలిసేందుకు లండన్ వెళ్తూ..నవవధువు మృతి

గుజరాత్లోని అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటన ఎంతో విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారంతా దుర్మరణం చెందారు. విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలడంతో 20 మంది మెడికోలు మృతిచెందారు.1988 లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ఇదే అంత పెద్ద ప్రమాదం. 37యేళ్ల క్రితం విమాన ప్రమాదం ఎంత విషాదాన్ని మిగిల్చిందో అంతకంటే ఎక్కువ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదం చేదు జ్ణాపకాలను మిగిల్చింది. 

గురువారం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్ కు చెందిన ఓ నవవధువు ప్రాణాలు కోల్పోయింది. బలోతారా జిల్లాలోని అరబాకు చెందిన ఖుష్బూ ఈ ఏడాది జనవరిలో మన్పూల్ సింగ్ ను పెళ్లాడింది. లండన్ లో చదువుతున్న భర్తను మొదటిసారి కలిసేందుకు వెళ్తుండగా విమాన ప్రమాదంలో మృతిచెందింది. 
అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న చాలా మంది ఆశలు, కలలు ప్రమాదంతో చెదిరిపోయాయి. అదృష్టవశాత్తు ఒక్కరు తప్పా ప్రాణాలతో బయటపడిన వారు ఎవరూ లేరని అధికారులు చెప్పడం ప్రమాదం ఎంత విషాదం మిగిల్చిందో తెలుస్తుంది. 

విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తు కోల్పోవడంతో మధ్యాహ్నం 1.38 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. విమానం దాదాపు 825 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా కిందపడటం ప్రారంభమైంది. అంతా నిశ్శబ్దం అయ్యేలోపు పైలట్ నుంచి మేడే కాల్ వచ్చింది. ఇంతలో పెద్ద శబ్ధం.. మైళ్ల దూరం ఎగిసిపడుతూ కనిపించిన అగ్నిగోళం.. అంతా స్మాష్.. 

ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ప్రయాణీకులలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీషర్లు, ఒక కెనడియన్ ,ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు.