
న్యూఢిల్లీ: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నందున ఎయిర్ ఇండియా శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 వరకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నామని తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారు వాటిని రద్దు చేసుకునే విషయంలో సహకరిస్తామని చెప్పింది. ప్యాసింజర్లు, విమాన సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఎక్స్’లో పేర్కొంది.