అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు : ఇళ్లల్లోకి వెళ్లిపోయిన జనం.. రోడ్లు అన్నీ ఖాళీ

అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు : ఇళ్లల్లోకి వెళ్లిపోయిన జనం.. రోడ్లు అన్నీ ఖాళీ

హర్యానా రాష్ట్రం.. అంబాలాలో యుద్ధ సైరన్లు మోగించారు ఎయిర్ పోర్స్ అధికారులు. 2025, మే 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో.. అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ సైరన్లు మోగించారు అధికారులు. 

పాకిస్తాన్ దేశం నుంచి దాడి జరిగే అవకాశం ఉంది.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జనం అంతా ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని.. కిటికీలకు దూరంగా ఉండాలని.. కరెంట్ ఆఫ్ చేసుకోవాలని సూచిస్తూ.. ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. 

9వ తేదీ తెల్లవారుజామున చండీఘడ్ లోనూ ఇలాగే సైరన్లు మోగిస్తూ.. హెచ్చరికలు జారీ చేశారు సైనిక అధికారులు. ఆ తర్వాత అంబాలా ఎయిర్ ఫోర్స్ క్యాంప్ నుంచి ఇలాంటి హెచ్చరికలు రావటంతో.. జనం అంతా ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. రోడ్లు అన్నీ ఖాళీ అయ్యాయి. జనం ఇళ్లల్లోకి వెళ్లిపోయారు.

Also Read:-చండీఘడ్​ లో మోగిన ​ సైరన్​.. హై అలర్ట్​ ప్రకటించిన భద్రతా దళాలు

 అంబాలా సిటీలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. అంబాలా సిటీ అనేది పాకిస్తాన్ సరిహద్దులకు స్ట్రాటజికల్ లోకేషన్ లో ఉంది. ఇక్కడి నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు సైతం ఆపరేట్ అవుతుంటాయి. అంబాలా సిటీలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది భారత్ కు అత్యంత కీలకం. పాకిస్తాన్ ఇప్పుడు అంబాలా సిటీని టార్గెట్ చేస్తూ డ్రోన్, మిస్సైల్ దాడులు చేయొచ్చనే ఉద్దేశం, అనుమానాలతో ముందస్తుగా ఈ యుద్ధ సైరన్స్ మోగించింది. 

అంబాలా సిటీలో యుద్ధ సైరన్స్ మోగించటంతోపాటు.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు ఆర్మీ అధికారులు. దాడులు జరిగే ప్రమాదం ఉందని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు.