చండీఘడ్​ లో మోగిన ​ సైరన్​.. హై అలర్ట్​ ప్రకటించిన భద్రతా దళాలు

చండీఘడ్​ లో మోగిన ​ సైరన్​..  హై అలర్ట్​ ప్రకటించిన భద్రతా దళాలు


పహల్గాం అటాక్​ తరువాత భారత .. పాకిస్తాన్​ మధ్య క్షణ క్షణానికి పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుంది. మే 8 వ  రాత్రి జమ్మూలో విరుచుకుపడేందుకు వచ్చిన పాక్​ డ్రోన్లను భారత సైన్యం తిప్పికొట్టింది.  దీంతో ఈ రోజు ( మే 9)  ఉదయం 8 ప్రాంతంలో అమృతసర్​ లో సైరగన్​ మోగగా  ఇప్పుడు తాజాగా  ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చండీఘడ్​ లో భద్రతా దళాలు  ఎయిర్​ సైరన్​ మోగించాయి.   ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు.   బాల్కనీల్లో కూడా ఉండద్దని ప్రజలకు సూచించారు. 

యుద్ద విమానాలతో పాకిస్తాన్​ దుస్సాహసానికి పాల్పడుతోంది.  ఇది ఇలా ఉంటే పాకిస్తాన్​ ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్​ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల దగ్గర హైఅలర్ట్‌ ప్రకటించింది భారత రక్షణశాఖ . ఎయిర్‌పోర్టుల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచించింది.

భారత్‌పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. పీవోకేలో భారతదేశం భారీ ప్రతీకార దాడిని ప్రారంభించింది. ఫిరంగి నుండి గుండ్లు దూసుకుపోతున్నాయి. అంతే కాకుండా, డ్రోన్లను ఉపయోగించి ఎదురుదాడి కూడా జరుగుతోంది. భారతదేశం ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.

ఇండియా గేట్ ఖాళీ చేయించిన అధికారులు

పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది.  సరిహద్దు ప్రాంతంలో భయాందోళనలు, గందరగోళం నెలకొంది. భారతదేశం తన దేశ అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల కోసం కూడా బలమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఇండియా గేట్ చుట్టూ ఎవరూ ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపట్టింది.