వచ్చే 20 ఏళ్లలో కొత్తగా 2,210 విమానాలు అవసరం

వచ్చే 20 ఏళ్లలో కొత్తగా 2,210 విమానాలు అవసరం

హైదరాబాద్‌‌, వెలుగు: దేశ ఏవియేషన్ సెక్టార్‌‌‌‌కి  వచ్చే 20 ఏళ్లలో కొత్తగా 2,210 విమానాలు అవసరమవుతాయని  విమానాల తయారీ కంపెనీ ఎయిర్‌‌‌‌బస్‌‌ గురువారం పేర్కొంది.  హైదరాబాద్‌‌లో జరుగుతున్న ఎయిర్‌‌‌‌షో ‘వింగ్స్‌‌ ఇండియా2022’ లో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు పై వ్యాఖ్యలు చేశారు. దేశ ఏవియేషన్ సెగ్మెంట్‌‌ మరింత  పెరుగుతుందని, మరిన్ని విమానాలకు డిమాండ్ క్రియేట్ అవుతుందని అంచనావేశారు. వచ్చే రెండు దశాబ్దాలలో కొత్తగా 1,770 చిన్న విమానాలు, 440 మీడియం, లార్జ్ విమానాలను ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీలు ఆర్డర్ చేస్తాయని ఎయిర్‌‌‌‌బస్‌‌ అంచనావేసింది. వచ్చే 10 ఏళ్లలో దేశ ఎకానమీ మిగిలిన జీ20 దేశాలతో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతుందని  ఎయిర్‌‌‌‌బస్‌‌ ఇండియా అండ్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్‌‌ రెమి మెయిల్‌‌లార్డ్‌‌ అన్నారు. ఎయిర్‌‌‌‌ ట్రావెల్‌‌పై మిడిల్ క్లాస్ మరింతగా ఖర్చు చేస్తుందని అన్నారు. ప్యాసెంజర్ ట్రాఫిక్‌‌ ఏడాదికి 6.2 శాతం వృద్ధి చెందుతుందని, ఇది మిగిలిన దేశాల కంటే చాలా ఎక్కువని పేర్కొన్నారు. గత  పదేళ్ల నుంచి చూస్తే దేశంలో ఎయిర్ ట్రాఫిక్ పెరగడం చూడొచ్చని, డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ మూడు రెట్లు పెరిగిందని ఎయిర్‌‌‌‌బస్ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ డబుల్ అయ్యిందని వివరించింది. ప్రస్తుతం చాలా ఇంటర్నేషనల్ రూట్లలో ఫారిన్ ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీల హవా కొనసాగుతోందని తెలిపింది. ‘ఏ320 ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌లతో ఇండియా మార్కెట్‌‌ పెరుగుతుండడం చూశాం. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్‌‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే మంచి టైమ్‌‌’ అని రెమి పేర్కొన్నారు.   దేశ ఎవియేషన్ ఇండస్ట్రీ వేగంగా ఎదుగుతోందని, ఈ డిమాండ్‌‌ను చేరుకోవడానికి 2040 నాటికి 34 వేల మంది పైలెట్లు, 45 వేల మంది టెక్నీషియన్లు అవసరమవుతారని ఎయిర్‌‌‌‌బస్ అంచనావేసింది.  వచ్చే పదేళ్ల వరకు వారానికి ఒక ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌నైనా ఇండియాకు డెలివరి చేస్తామని ప్రకటించింది.  ఇండియా నుంచి  మొత్తం 47 మంది సప్లయర్లు తమకు విడి భాగాలను  సప్లయ్‌‌ చేస్తున్నారని, ఏడాదికి 650 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని ఎయిర్‌‌‌‌బస్  పేర్కొంది. 

ఎయిర్‌‌‌‌బస్‌‌ రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్‌‌

వింగ్స్ ఇండియా ఈవెంట్‌‌లో ఉద్యోగులను హైర్ చేసుకుంటామని ఎయిర్‌‌‌‌బస్ ప్రకటించింది.  మార్చి 26,27 తేదీలలో ఈ హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. బేగంపేట్ ఎయిర్‌‌‌‌పోర్టులోని హాల్‌‌ ఏ, స్టాండ్ 12 దగ్గర రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్‌‌ ఉంటుంది. జాబ్స్‌‌ కోసం చూసే వారు ఎయిర్‌‌‌‌బస్‌‌లోని ఖాళీ పొజిషన్లకు అప్లయ్ చేసుకోవచ్చు.  ఏవియేనిక్స్ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌, ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ సిస్టమ్‌‌ సిమ్యులేషన్‌‌, ఎయిర్‌‌‌‌ఫ్రేమ్‌‌ స్ట్రక్చర్స్‌‌ జాబ్స్ కోసం ఎయిర్‌‌‌‌బస్‌‌ ఎక్కువగా హైర్ చేసుకోనుంది. అదనంగా సైబర్ సెక్యూరిటీ, ఏపీఐ డెవలప్‌‌మెంట్‌‌, ఫుల్‌‌ స్టాక్‌‌ డెవలప్‌‌మెంట్‌‌,  బిగ్ డేటా, క్లౌడ్‌‌,  డెవ్‌‌ఓప్స్‌‌, ఐఓటీకి చెందిన పొజిషన్ల కోసం హైరింగ్ ఉంటుంది. ఎయిర్‌‌‌‌బస్‌‌కు దేశంలో 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 1,650 మంది ఇంజినీర్లు.  కంపెనీలోని ఇంజినీర్లు, ఐటీ ఉద్యోగులను ఈ ఏడాది చివరి నాటికి 2,000 దాటించాలని ఎయిర్‌‌‌‌బస్‌‌ చూస్తోంది.