
న్యూఢిల్లీ: ఈస్టర్న్ అఫ్గానిస్తాన్‌లో ఆ దేశ సెక్యూరిటీ ఫోర్సెస్ బుధవారం జరిపిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో 45 మంది చనిపోయారు. మృతుల్లో తాలిబన్‌లతోపాటు పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో కనీసం 8 మంది పౌరులు ఉండొచ్చునని ఈస్టర్న్ అఫ్గానిస్తాన్ ప్రావిన్స్‌లోని అద్రస్కన్ జిల్లా గవర్నర్ అలీ అహ్మద్ ఫకీర్ యార్ చెప్పారు. ఖామ్ జియారత్ ఏరియాలో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో నలభై ఐదు మంది చనిపోయారని, వారిలో తాలిబన్‌లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 37 మంది మృతుల్లో ఎంత మంది తాలిబన్‌లు, పౌరులు ఉన్నారనేది తెలియరాలేదు. ఈ ఘటనలో పౌరుల మృతిపై అఫ్గాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విచారణకు ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ వివరాలు పబ్లిక్‌తోపాటు మీడియాకు వెల్లడిస్తామని వివరించింది. ప్రజల ఆస్తులతోపాటు వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్‌పై ఉందని ఫకీర్ యార్ పేర్కొన్నారు.