28 కాదు 30 రోజుల వ్యాలిడిటీ అని సంబరపడకండి.. ఆ రెండు రోజులకు 30 రూపాయలు ఎక్స్ ట్రా !

28 కాదు 30 రోజుల వ్యాలిడిటీ అని సంబరపడకండి.. ఆ రెండు రోజులకు 30 రూపాయలు ఎక్స్ ట్రా !

28 రోజుల రీఛార్జ్ ప్లాన్స్‌‌‌ స్థానంలో ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని వార్తలొచ్చిన గంటల వ్యవధిలోనే టెలికాం కంపెనీలు అతి తెలివి ప్రదర్శించాయి. 28 రోజుల రీఛార్జ్ ప్లాన్స్ స్థానంలో కాదు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్లను కొత్తగా తీసుకొచ్చాయి. అంటే.. 28 రోజుల రీఛార్జ్ ప్లాన్, 30 రోజుల ప్లాన్.. రెండూ అందుబాటులో ఉంటాయి.

అయితే.. 2 రోజుల వ్యాలిడిటీ పొందినందుకు కస్టమర్లపై 30 రూపాయల అదనపు భారం పడనుంది. ఉదాహరణకు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ప్లాన్స్ చూసుకుంటే.. 349 రూపాయలకు.. రోజుకు 1.5జీబీ డేటా+ అన్ లిమిటెడ్ 5జీ సేవల ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదే.. 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ కావాలంటే.. 379 రూపాయలు చెల్లించాల్సిందే.

అయితే.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లకు ఒక్కటే తేడా. 349 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటాతో వస్తుంటే, 379 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటాతో వస్తుంది. అంటే.. 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా వచ్చే ప్లాన్ అసలు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్లోనే లేకపోవడం గమనార్హం. రోజకు 1.5 జీబీ డేటా బదులు 2జీబీ ఇస్తున్నామనే కారణంతో 30 రోజుల రీఛార్జ్ ప్లాన్కు రెండు రోజులు ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చినందుకు గానూ 30 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తుండటం గమనార్హం.

►ALSO READ | బర్త్ టూరిజంపై ట్రంప్ ఉక్కుపాదం.. అక్రమ నెట్‌వర్క్ సాయంతో అమెరికా వెళితే శాశ్వత నిషేధం!

ట్రాయ్​మాత్రం 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలిచ్చామని, ఏడాదిలో 12 సార్లు మాత్రమే రీచార్జ్ చేస్తే సరిపోతుందని చెప్పుకొచ్చింది. టెలికాం కంపెనీలు ట్రాయ్ ఆదేశాలను పాటిస్తూనే కస్టమర్ల నుంచి తెలివిగా దోచుకుంటున్నాయి. 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో కాకుండా వాటితో పాటుగా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను అదనపు ధరలతో తీసుకొస్తున్నాయి.