టారిఫ్ రేట్లు పెంచే ఆలోచనలో ఎయిర్టెల్

టారిఫ్ రేట్లు పెంచే ఆలోచనలో ఎయిర్టెల్

ఎయిర్‌‌‌‌టెల్.. రీఛార్జ్‌‌‌‌ రేట్లను మరోసారి పెంచే ఆలోచన చేస్తోందని కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడించారు. జులైలోపు టారిఫ్‌‌ రేట్ల పెంపు ఉంటుందని తెలిపాడు. ఈ ఏడాదిలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెంచుకోవాలని ఎయిర్ టెల్ కంపెనీ టార్గెట్‌‌గా పెట్టుకుంది. వ్యాపారంలో ఇన్కం కంటే ఎక్స్పెండీచర్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌‌‌‌టెల్ టారిఫ్ రేట్లను పెంచితే మిగిలిన కంపెనీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఈ రేట్ల పెంపుతో ఈ కంపెనీల ఆర్పూ రూ. 20–25 పెరుగుతుందని అంచనా. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే టారిఫ్ రేట్లు తక్కువగానే పెంచుతామని, దీనివల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వవని ఎయిర్ టెల్ పేర్కొంది.