శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్:  ఆపరేషన్​సిందూర్  వేళ  శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం  కలకలం రేపుతోంది.   గుర్తు తెలియని వ్యక్తి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది .  దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా.. లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత్​– పాక్​ ఉద్రిక్తత వేళ బాంబు బెదిరింపు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.