Aishwarya Rai: ‘OG క్వీన్ ఆఫ్ కేన్స్’.. నుదుటిన ‘సిందూరం’తో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య రాయ్‌

Aishwarya Rai: ‘OG క్వీన్ ఆఫ్ కేన్స్’.. నుదుటిన ‘సిందూరం’తో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య రాయ్‌

78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో ఇండియాన్ సినీ స్టార్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కనిపించి ఆకర్షిస్తున్నారు. అందరిలో కెల్లా అందాల తార ఐశ్వర్య రాయ్ నుదుట సిందూర్ ధరించి శభాష్ అనిపించుకుంది.

భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఐశ్వర్య రాయ్.. నుదుటిన సిందూరంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. 'ఆపరేషన్ సిందూర్' కు 'నివాళి' గా ఐశ్వర్య  పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ సాంప్రదాయమైన చీరలో తళుక్కుమని మెరిసింది. రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ తెల్లటి చీర, అంచుపై బంగారు రంగు డిజైన్, మెడలో హారాలు, 500 క్యారెట్ల మొజాంబిక్ రూబీలు మరియు 18k బంగారంలో కత్తిరించని వజ్రాలతో అలంకరించబడిన నెక్లెస్‌ ఇలా ప్రతిదీ చక్కగా అలంకరించుకుని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అంతేకాకుండా భారతీయ గౌరవ మర్యాదలను గుర్తుచేసేలా చేతులు జోడించి నమస్కారం చెప్తూ ఐశ్వర్య తన ప్రత్యేకతను చాటుకుంది. మొదట 2002లో తన చిత్రం దేవదాస్ ప్రీమియర్ కోసం కేన్స్‌లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య, దాదాపు 23 సంవత్సరాల తర్వాత తన రెడ్ కార్పెట్ పై నడిచి చరిత్ర సృష్టించింది. 

ప్రస్తుతం ఆమె లుక్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు లైక్స్ కొడుతూ, ట్వీట్స్ పెడుతూ పోస్టులు చేస్తున్నారు. “OG క్వీన్ ఆఫ్ కేన్స్” అని, “ఆమెను ఎవరూ ఓడించలేరు. క్వీన్ ఎల్లప్పుడూ క్వీనే - కిరీటం ఉన్నా లేకపోయినా” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ నెల 24 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ వేడుకలు జరగనున్నాయి.