రజినీతో ఐష్ వన్స్ మోర్?

రజినీతో ఐష్ వన్స్ మోర్?

శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రోబో సినిమాలో మొదటిసారి కలిసి నటించారు సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్యరాయ్..  మళ్లీ ఈ పెయిర్ 12 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేయనుంది. ఈ మధ్య సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన రజినీ ప్రస్తుతం బీస్ట్ మూవీ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుల్ మోహన్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.