హైదరాబాద్ లో రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. పాతకక్షలతో ఓ వ్యక్తిపై దాడి చేసి హంగామా సృష్టించాడు రౌడీషీటర్. గురువారం ( డిసెంబర్ 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలోని మహమూదా హోటల్ దగ్గర హంగామా సృష్టించాడు ఓ రౌడీషీటర్. జమీల్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి వీరంగం సృష్టించాడు సయ్యద్ సోహెల్ అనే రౌడీషీటర్. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురయ్యారు స్థానికులు.
నిందితుడు బాలాపూర్ కి చెందిన రౌడీ షీటర్ సయ్యద్ సోహెల్ గా గుర్తించారు పోలీసులు. జమీల్, సోహెల్ మధ్య పాతకక్షలే దాడికి కారణమని తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జమీల్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం జమీల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. రౌడీ షీటర్ సయ్యద్ సోహెల్ కు జమీల్ కు మద్య ఉన్న పాతకక్షలు దాడికి కారణమని తెలిపారు పోలీసులు.జమీల్ హోటల్ దగ్గర ఒంటరిగా ఉన్నాడు అనే సమాచారం తెలుసుకున్న సోహెల్ వట్టేపల్లికి వచ్చి దాడికి పాల్పడ్డాడని.. ఈ క్రమంలో జమీల్ అక్కడికక్కడే కుప్పకూలాడని తెలిపారు పోలీసులు.
