
వెండితెరకు..కథానాయికలు మరింత గ్లామర్ తీసుకొస్తారు. తమ అందంతో బాగా అట్రాక్ట్ చేస్తారు. అలాంటిది కొందరు హీరోయిన్స్ అందం కంటే.. అభినయానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అందుకోసం నెగిటివ్ రోల్స్ ఎంచుకుంటున్నారు. అప్పట్లో సౌందర్య ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేసింది. మంచి తనానికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకుంది. అలాంటిది శ్రీకాంత్ హీరోగా నటించిన నా మనసిస్తారా..రా మూవీలోప్రతినాయిక పాత్రలో నటించింది.
నరసింహాలో రమ్యకృష్ణ విలనిజాన్ని మరిచిపోవటం అంత సులభం కాదు. రజనీకాంత్ ను ముప్పు తిప్పలు పెట్టి.. ఢీ అంటే ఢీ అనేల నటించింది. ధనుష్ ధర్మయోగి మూవీలో త్రిష మెయిన్ విలన్ గా భయపెట్టింది. అలాగే సీత సినిమాలో కాజల్ నెగిటిల్ షేడ్స్ పాత్రలో..నటన చూపించింది. రాశీ నిజం సినిమాలో గోపిచంద్ తో కలిసి విలనిజం పండించింది. పాయల్ రాజ్ పుత్..ఆర్ఎక్స్ 100లో..చెడ్డదానిలా కనిపించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీయ రెడ్డి లాంటి అందగత్తెలు విలనిజం బాగా పండిస్తున్నారు.
ఎంత సక్కగా ఉన్నవే..అని పొగిడించుకున్న సమంత..ప్రేక్షకుల చేత తిట్టించుకుంది. విక్రమ్ హీరోగా నటించిన పత్తు ఎంద్రాకుల్లా మూవీలో ప్రతినాయికత్వం చూపించింది. రెజీనా.. చక్ర, ఎవరు లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్ లో కనిపించింది. మణి రత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ రిలీజ్ కు రెడీగా ఉంది. స్టార్లు ఈ మూవీలో నటించారు. ఇక ఐశ్వర్య రాయ్ ను.. ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన..మణిరత్నం..పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఈమెను నెగిటివ్ రోలో చూపించబోతున్నాడు. మరో కోణంలో ఆవిష్కరించబోతున్నాడు. ఈ మూవీలో ఈ ప్రపంచ సుందరి..డ్యూయల్ రోల్ లో కనిపించబోతుందట. అందులో..ఓ క్యారెక్టర్ లో ..చెడ్డతనం ప్రదర్శిస్తుందట.