Andhera: 'అంధేరా' .. ఆడియన్స్‌‌‌‌ను థ్రిల్ చేస్తున్న ఇన్వెస్టిగేట్‌ వెబ్ సిరీస్!

Andhera: 'అంధేరా' ..  ఆడియన్స్‌‌‌‌ను థ్రిల్ చేస్తున్న ఇన్వెస్టిగేట్‌ వెబ్ సిరీస్!

ముంబైలో పనిచేస్తున్న ఒక ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ కల్పన (ప్రియా బాపట్). ఒకరోజు ఆమె దగ్గరకు బాని బారువా(జాహ్నవి రావత్) అనే మహిళ మిస్సింగ్ కేసు వస్తుంది. వెంటనే ఇన్వెస్టిగేషన్‌‌‌‌ మొదలుపెడుతుంది. మరో వైపు మెడిసిన్ స్టూడెంట్‌‌‌‌ జయసేథ్ (కరణ్ వీర్) అతని అన్న డాక్టర్‌‌‌‌‌‌‌‌ పృథ్వీ(ప్రణయ్ పచౌరి) కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దాంతో పృథ్వీ కోమాలోకి వెళ్తాడు. జయసేథ్ సేఫ్‌‌‌‌గా బయటపడతాడు. 

అయితే.. యాక్సిడెంట్‌‌‌‌ జరిగినప్పుడు ‘‘అంధేరా”(అంధకార) శక్తి తన అన్నను అలుముకోవడం జయసేథ్‌‌‌‌ చూస్తాడు. దాంతో అప్పటినుంచి ఆ చీకటి రూపం మీద రీసెర్చ్‌‌‌‌ మొదలుపెడతాడు. అందులో భాగంగానే జయసేథ్‌‌‌‌కు పారానార్మల్ రీసెర్చర్‌‌‌‌‌‌‌‌ రూమి (ప్రజక్తా కోలి)తో పరిచయం అవుతుంది. ఈ ఇద్దరిని కలిసిన కల్పన బాని బారువా మిస్సింగ్‌‌‌‌కు కూడా ‘అంధేరా’నే కారణమని తెలుసుకుంటుంది. మరింత లోతుగా ఇన్వెస్టిగేట్‌‌‌‌ చేస్తే.. అయేషా (సుర్వీన్ చావ్లా) నడిపే ఒక వెల్‌‌‌‌నెస్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో అసలు రహస్యం దాగి ఉందని ఆమెకు తెలుస్తుంది. ఆ రహస్యం ఏంటి? అంధేరా ఎలా పుట్టింది? తెలుసుకోవాలంటే సిరీస్‌‌‌‌ చూడాలి. 

రాఘవ్ దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుతమైన థ్రిల్లర్, మానసిక సంఘర్షణ, ఆధ్యాత్మిక శక్తులు, వాస్తవ ప్రపంచంలోని నేరాల మధ్య ఉన్న గందరగోళాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రియా బాపట్, కరణ్‌‌‌‌వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా, ప్రణయ్ పచౌరి, పర్విన్ దబ్బాస్, వత్సల్ షేత్, కవిన్ దవే, జాహ్నవి రావత్ వంటి నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయి ఆడియన్స్‌‌‌‌ను థ్రిల్ చేస్తారు. మీరు థ్రిల్లర్స్, పారానార్మల్ కథాంశాలను ఇష్టపడితే, అమెజాన్ ప్రైమ్‌‌‌‌లో స్ట్రీమ్ అవుతున్న 'అంధేరా' మీకు తప్పకుండా నచ్చుతుంది.