
నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన చిత్రం ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్స్‌గా నటించగా, నరేష్, వాసుకి కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారా రోహిత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
షూటింగ్ మొదలైనప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడూ అంతే హ్యాపీగా ఉన్నాం. వినాయక చవితికి సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా టెక్నీషియన్స్, కోస్టార్స్ అందరికీ ఈ సినిమా మంచి జ్ఞాపకంగా ఉంటుంది’ అని అన్నాడు. ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్‌ని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ చెప్పింది.
ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతుందని నరేష్ అన్నారు. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని వాసుకి చెప్పింది. ఫస్ట్ మూవీ పండగ రోజు రిలీజ్ అవడం డ్రీమ్ మూమెంట్ అని దర్శకుడు వెంకటేష్ అన్నాడు. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాత థ్యాంక్స్ చెప్పారు.