డిఫరెంట్ స్క్రిప్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఐశ్వర్య రాజేష్. కంటెంట్ బాగుంటే స్టార్ ఎవరని చూడకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఓ.! సుకుమారి’. తిరువీర్‌కు జంటగా నటిస్తోంది. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.
శనివారం ఐశ్వర్య రాజేష్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోపాటు తన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె దామిని పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. చేతుల్లో కర్రలు పట్టుకున్న గ్రామస్థుల నుంచి తప్పించుకుంటూ పరుగులు తీస్తూ, ఆమె ధైర్యం, చలాకీతనంతో కలర్‌ఫుల్ హాఫ్- శారీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన తీరు ఆకట్టుకుంది.
ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. సి.హెచ్. కుషేందర్ డీవోపీగా వర్క్ చేస్తుండగా కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నాడు.
