
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఇటీవల నిఖిల్ ‘స్పై’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ తెలుగులో జాక్‌పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. సుజీత్ డైరెక్షన్లో పవన్ కల్యాన్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’ సినిమాలో చాన్స్ పట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు సినిమాలకే పవర్ స్టార్ సినిమాలో ఆఫర్ దక్కించుకోవడంతో ఐశ్వర్య పేరు ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే ఓజీలో ప్రియా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా రెడ్డిని కీలక పాత్ర కోసం సెలక్ట్ చేశారు. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్ రాజ్, తమిళ యాక్టర్ అర్జున్ దాస్ వంటి ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్‌తో ఓజీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్య పేరు వినిపిస్తోంది. దీనిపై ఓజీ టీం అఫీషియల్ ప్రకటన చేయాల్సి ఉంది.