సింగరేణి వేడుకలను ఘనంగా నిర్వహించాలి : కె.రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్

సింగరేణి వేడుకలను ఘనంగా నిర్వహించాలి :  కె.రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్
  •  ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేకపోతే, ఏఐటీయూసీ వేడుకలను బహిష్కరిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం గోదావరిఖని భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన యూనియన్​ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

సింగరేణిలో 20ఏండ్లుగా డిసెంబర్ 23న ఘనంగా నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు నిధులు తక్కువగా విడదల చేసిందని, దీన్ని గుర్తింపు సంఘంగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్,  కన్నం లక్ష్మీనారాయణ, బుర్ర భాస్కర్, ఆకుల సురేశ్‌‌‌‌‌‌‌‌, పడాల కనకరాజు, జగదీశ్వర్, మల్లేశ్‌‌‌‌‌‌‌‌, రాజబాబు ఆఫీస్ కార్యదర్శి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.