జూలూరుపాడులో శాశ్వత మార్కెట్​ యార్డు​ ఏర్పాటు చేయాలి : ఏఐటీయూసీ

జూలూరుపాడులో శాశ్వత మార్కెట్​ యార్డు​ ఏర్పాటు చేయాలి : ఏఐటీయూసీ

జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ యార్డ్  ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ గురువారం  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగాఏఐటీయూసీ వైరా నియోజకవర్గ కార్యదర్శి మంకెన కృష్ణ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లేక పదేండ్లుగా కార్మికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లాల విభజన నేపథ్యంలో జులూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండడంతో ఇక్కడ వస్తున్న ఆదాయం దాదాపు రూ.2 కోట్లు ఖమ్మం జిల్లాకు పోతోందన్నారు.

కానీ ఇక్కడ శాశ్వత మార్కెట్ యార్డ్ లేక, కార్మికులకు భోజనం చేయడానికి షెడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి  గుండెపిన్ని వెంకటేశ్వర్లు, చాంద్ పాషా, హమాలీ కార్మికులు పప్పుల జాను, భాస్కర్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, ఎస్కే సొందు నాగుల్ మీరా, సురేశ్, రమేశ్ ​పాల్గొన్నారు