ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాల వివాదం మరింత ముదురుతోంది. అమ్మకాల్లో హెచ్ సీఏ బ్లాక్ దందా కొనసాగుతోందని  ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళన చేపట్టారు ఏఐవైఎఫ్ నేతలు. 20 నిమిషాల్లో 70 వేల టికెట్లు ఏవిధంగా అమ్ముడుపోయాయంటూ ప్రశ్నించారు.  క్రికెట్ అభిమానులకు  టికెట్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారన్నారు. ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. 

హెచ్ సీఏ  ప్రతినిధుల్ని కలిసేందుకు   స్టేడియం లోపలికి అనుమతించక పోవడంతో గేట్లని తోసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు  పలు సంఘాల నాయకులు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. 

మరో వైపు   కొండాపూర్​ ఏరియాలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.   సన్​రైజర్స్​హైదరాబాద్​వర్సెస్​రాయల్​చాలెంజర్స్​బెంగళూరు మ్యాచ్​కు సంబంధించిన 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్​ను రూ.10 వేల నుంచి రూ.15 వేలు చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది.