 
                                    అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘‘దే దే ప్యార్ దే 2’. అన్షుల్ శర్మ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు ‘రాత్ భర్’ అనే పాటతో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. ‘జూమ్ బరాబర్.. జూమ్ షరాబీ’ అనే మరో పాటను విడుదల చేశారు.
యోయో హనీ సింగ్ కంపోజ్ చేసి, రాసి, పాడిన ఈ పెప్పీ నంబర్‌కు గణేష్ ఆచార్య డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అజయ్ దేవగన్, రకుల్, యోయో హనీ సింగ్‌లపై కలర్‌ఫుల్ బార్ సెటప్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించారు. రకుల్ గ్లామర్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రొమాంటిక్ బోల్డ్ స్టెప్పులతో అజయ్, రకుల్ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఒక స్టెప్పులో అజయ్, రకుల్ ఛాతీపై వాలి డ్యాన్స్ చేయడం వైరల్ అవుతుంది. 56 ఏళ్ల అజయ్ దేవగన్.. ఇటీవల మ్యారేజ్ చేసుకున్న 33 ఏళ్ల రకుల్తో డ్యాన్స్ ఇరగదీశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తన తండ్రి వయసున్న అజయ్ దేవగన్‌ను ప్రేమించి, పెళ్లికి రెడీ అయిన యువతిగా ఆమె ఇందులో నటించింది. తనకు తండ్రి పాత్రలో మాధవన్ నటించారు. టీ సిరీస్ భూషన్ కుమార్, కృష్ణ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గర్గ్ నిర్మిస్తున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

 
         
                     
                     
                    