Ajith Hospitalised: పద్మభూషణ్ అవార్డు తీసుకున్న అజిత్.. గాయాలతో ఆసుపత్రిలో చేరిక.. ఏమైందంటే?

Ajith Hospitalised: పద్మభూషణ్ అవార్డు తీసుకున్న అజిత్.. గాయాలతో ఆసుపత్రిలో చేరిక.. ఏమైందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డును అందుకున్న తర్వాత, అజిత్ చెన్నైకి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే భారీ సంఖ్యలో అభిమానులు అజిత్ వైపు దూసుకురావడంతో కాలికి స్వల్ప గాయమైందని సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇక అజిత్ ఆసుపత్రిలో చేరడంతో దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో తన అభిమాన నటుడికి ఏమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అజిత్కు ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించినట్టు నివేదికలు చెబుతున్నాయి. సాయంత్రంలోపు  డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఏప్రిల్ 28న ఢిల్లీలో హీరో అజిత్ కుమార్ కు పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ అద్భుతమైన క్షణాన్ని జరుపుకోవడానికి ఆయన కుటుంబం కూడా ఢిల్లీకి వచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత, అజిత్ ఢిల్లీ నుండి చెన్నై చేరుకున్నారు.  అక్కడ ఆయనకు అభిమానులు, మీడియా ఘాన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.