Vidaamuyarchi: సస్పెన్స్ థ్రిల్లర్‌గా అజిత్ మూవీ టీజర్.. స్టార్ హీరోలకి పోటీగా సంక్రాంతి బరిలో

Vidaamuyarchi: సస్పెన్స్ థ్రిల్లర్‌గా అజిత్ మూవీ టీజర్.. స్టార్ హీరోలకి పోటీగా సంక్రాంతి బరిలో

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి.అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. 

ఈ నేపథ్యంలో అజిత్ నుంచి ఓ సాలిడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు మగిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్న అజిత్ 62వ మూవీ ‘విడాముయర్చి’(Vidaamuyarchi).

యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్గా వస్తోన్న ఈ మూవీ నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ లేకుండా కట్ చేసిన ఈ స్టైలిష్ యాక్షన్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులోని ప్రతి పాత్రపై ఏదో మిస్టీరియస్ ఎలిమెంట్‌ ను చూపిస్తూ సాగిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్.

Also Read :- హల్దీ వేడుకలో నాగ చైతన్య-శోభిత.. ఫొటోలు వైరల్

అజిత్ కెరీర్‌‌‌‌లో వ‌‌‌‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌‌‌‌స్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్, త్రిష‌‌‌‌, అర్జున్ త‌‌‌‌మదైన న‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌తో ప్రేక్షకుల‌‌‌‌ను అల‌‌‌‌రించారు. ఇప్పుడు మ‌‌‌‌రోసారి ఈ ముగ్గురు ఆడియెన్స్‌‌‌‌ను మెప్పించ‌‌‌‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌, ఆర‌‌‌‌వ్‌‌‌‌, రెజీనా క‌‌‌‌సాండ్ర, నిఖిల్ ఇత‌‌‌‌ర కీల‌‌‌‌క పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.