Sobhita Naga Chaitanya: హల్దీ వేడుకలో నాగ చైతన్య-శోభిత.. ఫొటోలు వైరల్

Sobhita Naga Chaitanya: హల్దీ వేడుకలో నాగ చైతన్య-శోభిత.. ఫొటోలు వైరల్

నాగ చైతన్య - శోభితల (Naga Chaitanya Sobhita) వివాహం డిసెంబర్ 4న ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇరుకుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పెషల్గా ఏర్పాటు చేసిన సెట్లో నాగ చైతన్య - శోభితలకు హల్దీ వేడుక (మంగళ స్థానాలు) చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేదిక కోసం ప్రత్యేక సెట్ నిర్మిస్తున్నారు. సాంప్రదాయాల పరంగా ఈ పెళ్లి ఘనంగా జరగబోతున్నా.. అతిథులు మాత్రం చాలా తక్కువే రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు బ్రాహ్మణ సంప్రదాయంలో పెళ్లి జగనున్నట్లు సమాచారం. 

Also Read :- ఇకపై ఫాస్ట్‌‌‌‌గా సినిమాలు చేస్తా

మరోవైపు అక్కినేని వారి వేడుకకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరవుతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.అందులో మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ చైతన్య - శోభితల పెళ్లికి సంబంధించి ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.