ఒకే రోజు అజిత్, విజయ్‍ సినిమాలు రిలీజ్..ఒకరి మృతి

ఒకే రోజు అజిత్, విజయ్‍ సినిమాలు రిలీజ్..ఒకరి మృతి

చెన్నై థియేటర్లలో తమిళ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్ ల ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. విజయ్ నటించిన వారీసు, అజిత్ నటించిన తునివు సినిమాలు 8 ఏళ్ల తర్వాత ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి హీరోల అభిమానులకు మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే థియేటర్లపై కట్టిన విజయ్, అజిత్ సినిమా పోస్టర్ ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు సినిమా రిలీజ్ సందర్భంగా అర్థరాత్రి నుంచి ఇద్దరు హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విజయ్, అజిత్ సినిమాల విడుదల జోరు నడుస్తుండగా... అజిత్ అభిమానులు సినిమా చూసేందుకు వెళుతుండగా ట్రక్కు నుండి పడిపోయి.. ఓ వ్యక్తి గాయపడి మరణించారు. 
తన అభిమాన హీరో అజిత్ నటించిన తునివు సినిమాను చూసేందుకు ఓ వ్యక్తి 1 am షోని బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో థియేటర్ కి ట్రక్కులో వెళుతుండగా..  డ్యాన్స్ చేస్తూ ట్రక్కుపై నుంచి కిందపడి గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన చెన్నైలోని రోహిణి థియేటర్ సమీపంలో పూనమల్లి హైవేపై జరిగింది.

అజిత్ తునివు VS విజయ్ వారిసు 

అత్యంత పాపులర్ హీరోస్ అయిన ఇద్దరు స్టార్ హీరోస్ అజిత్, విజయ్ లు నటించిన తునివు, వరిసు సినిమాలు ఒకే రోజు థియేటర్‌లలో రిలీజ్ అయ్యాయి. హెచ్ వినోద్  దర్శకత్వం వహించిన హీస్ట్ థ్రిల్లర్ తునివు  చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాలో అజిత్ కుమార్, ప్రధాన పాత్ర పోషిస్తుండగా మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని, GM సుందర్ లు పలు క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో  కేరళలోని ప్రియదర్శని థియేటర్‌లో 120 అడుగుల ఫ్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఒక నటుడి కోసం ఇంత ఎత్తైన ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. మలయాళ చిత్ర పరిశ్రమకు నిలయమైన కేరళలో అజిత్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని పలువురు భావిస్తున్నారు. ఇక వరిసు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చిన ఈ మూవీలో తలపతి విజయ్, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, ఖుష్బు, ప్రభు, యోగి బాబు,  సంగీత ముఖ్య పాత్రల్లో నటించారు.