
బ్రిటన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతుంది. 608 పరుగుల భారీ లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. వర్షం కారణంగా రెండో టెస్ట్ చివరి రోజు (ఆదివారం) మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆటను 80 ఓవర్లకు కుదించారు మ్యాచ్ అఫిషియల్స్. ఓవర్ నైట్ స్కోర్ 77/3తో ఐదు రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది.
ALSO READ | వరుణ దేవా కరుణించవయ్యా: ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం.. ప్రారంభంకాని రెండో టెస్ట్
వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు సహకరించడంతో టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ చెలరేగిపోయాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోన్న ఓలీ పోప్‌ను 19 ఓవర్ తొలి బంతికే ఔట్ చేశాడు ఆకాష్ దీప్. అద్భుతమైన బంతితో ఓలీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో మరో వికెట్ తీశాడు ఆకాష్ దీప్. ఫస్ట్ ఇన్సింగ్స్ సెంచరీ హీరో హ్యారీ బ్రూక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు ఆకాష్ దీప్. ఇంగ్లాండ్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో ఇంగ్లాండ్ రెడ్ బాల్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (10), స్మిత్ (18) ఉన్నారు. రెండో టెస్టులో విజయానికి ఇండియాకు ఇంకో 5 వికెట్లు అవసరం కాగా.. అతిథ్య జట్టు 497 రన్స్ చేయాలి. టీమిండియా బౌలర్లు మంచి స్వింగ్‌లో ఉండటంతో ఇండియా విజయాన్ని అడ్డుకోవడం ఇంగ్లాండ్‌కు దాదాపు కష్టమే.