ఆకాశ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

ఆకాశ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

ఆకాశ్ మిస్సైల్ ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా బాలాసోర్ తీరం నుంచి చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. భూమి నుంచి ఆకాశంలోని టార్గెట్ ను ఛేదించేలా ఈ క్షిపణి ప్రయోగం చేశారు. ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ఇది రెండోసారి. ఆకాశ్ 1 S క్షిపణిలో దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వాడారు. ఇది తాజాగా సక్సెస్ అయింది. క్రూయిజ్ మిసైళ్లు, ఎయిర్ టూ సర్ఫేస్, బాలిస్టిక్ మిసైళ్లను కూడా ఆకాశ్ ధ్వంసం చేస్తుంది. శత్రువుల డ్రోన్లను కూడా కూల్చేస్తుంది. ఆకాశ్ 1 S  శత్రు మిసైళ్లను ఇది సుమారు 18 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి పసిగడుతుంది.