ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. పట్టుకొని మరీ వసూల్ చేస్తారు..

ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. పట్టుకొని మరీ వసూల్ చేస్తారు..

ఏదైన అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు మనం ముందుగా ఫ్రెండ్స్ ని అడుగుతుంటాం... కానీ ఇలా ఫ్రెండ్స్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు  తీసుకుంటే ఆదాయపు పన్ను శాఖకి జరిమానా కట్టాల్సి రావొచ్చు.  అవును, ఇది మీకు నమ్మంకంగా అనిపించకపోయినా నిజం.. దీనికి సంబంధించి ఒక పన్ను సలహా సంస్థ 'టాక్స్ బడ్డీ'  ట్వీట్ కూడా షేర్ చేసింది. 

అందులో రాహుల్ అనే వ్యక్తి డబ్బు అవసరం ఉంటే తన ఫ్రెండ్ నుంచి రూ.1.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అతనికి అదే మొత్తంలో అంటే రూ.1.2 లక్షలు జరిమానా పడింది. ఇది కేవలం రాహుల్ విషయంలోనే కాదు, చాలామందికి ఈ విషయం తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డబ్బు ఎందుకు తీసుకోవద్దు : ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, పెద్ద మొత్తంలో డబ్బు విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయి. అప్పు తీసుకోవడం, తిరిగి ఇవ్వడం లేదా విరాళాలు ఇవ్వడం వంటి వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటితే భారీ జరిమానాలు పడతాయి కూడా.

 రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం డబ్బు రూపంలో అప్పుగా తీసుకోవడం లేదా డిపాజిట్‌గా పొందడం సెక్షన్ 269SS ప్రకారం నేరం. దీనికి తీసుకున్న అప్పు మొత్తానికి సమానమైన జరిమానా పడుతుంది. ఒక వ్యక్తి నుంచి ఒకే రోజులో లేదా ఒకేసారి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు తీసుకుంటే సెక్షన్ 269ST ప్రకారం జరిమానా పడుతుంది. అది కూడా తీసుకున్న మొత్తానికి 100% అంటే ఎంత తీసుకుంటే అంత ఉంటుంది. అంతేకాదు మీరు ఎవరికైనా రూ.20వేలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు అప్పుగా కట్టిన అది కూడా సెక్షన్ 269T కింద జరిమానా పడుతుంది. 

ALSO READ : భార్య చేతిలో కమెడియన్ కు అవమానం..

ఏదైనా ఛారిటీకి లేదా గుడికి రూ.2,000 కంటే ఎక్కువ డబ్బు  విరాళంగా ఇస్తే, సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపు ఉండదు. ఆరోగ్య బీమా  అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బు  రూపంలో  తీసుకుంటే కూడా  పన్ను మినహాయింపు ఉండదు.

మీ బ్యాంకు అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేస్తే TDS (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కట్ అవుతుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 2% TDS కట్ అవుతుంది. ఒకవేళ మీరు గత 3 సంవత్సరాలుగా ఐటీ రిటర్న్‌లు అప్లయ్ చేయకపోతే, రూ.20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే TDS కటింగ్ 5% వరకు పెరుగుతుంది. వీటన్నిటిని తప్పించుకోవాలంటే, డిజిటల్ ట్రాన్సక్షన్స్  చేయడం మంచిది. బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ, చెక్కులు వాడటం ద్వారా పన్ను చట్టాలను పాటించడంతో పాటు అనవసరమైన జరిమానాలను తప్పించుకోవచ్చు.