ఫస్ట్ లుక్ టైటిల్ తో ఆసక్తి రేపుతున్న ‘ఆకాశవాణి’

V6 Velugu Posted on Aug 03, 2020

ఫస్ట్ లుక్‌‌‌‌ టైటిల్‌‌‌‌తోనే ఆసక్తి రేపుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ డే సందర్భంగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌‌‌‌ని రానా దగ్గుబా టి విడుదల చేశాడు. అశ్వి న్ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ఏయూ అండ్ ఐ బ్యానర్‌‌‌‌పై పద్మనాభరెడ్డి నిర్మిస్తు న్నారు. ఇక టైటిల్‌‌‌‌కి తగ్గట్టే ఫస్ట్ లుక్‌‌‌‌ని ఇంటరెస్టిం గ్‌ గా డిజైన్ చేశారు. ఓ పెద్ద మర్రిచెట్టు కింద మేకల మంద. చెట్టు ఊడలకు ఓ వైపు మేకలు కాస్తున్న కుర్రాడు. మరోవైపు రేడియో వేలాడుతూ ఉంది. ఈ మోషన్ పోస్టర్‌‌‌‌కి కాలభైరవ అందించిన మ్యూజిక్ హైలైట్. సముద్రఖని వంటి వెర్సటైల్ యాక్టర్ ఇందులో కీలకపాత్ర పోషిస్తు న్నప్పటికీ, కాన్సెప్ట్‌‌‌‌కే ప్రయారిటీ ఇస్తూ ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ని డిఫరెంట్‌‌‌‌గా డిజైన్ చేసి సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు. ఈ కథ రాయాలనే ఆలోచన రావడానికి కారణమైన ఫస్ట్ ఇమేజ్, షూటింగ్‌ లో ఫస్ట్ డే ఫస్ట్ తీసిన షాట్, కాలభైరవ ఈ సినిమాకి ఫస్ట్ ఇచ్చిన సౌండ్ ఇదేనంటూ వివరించాడు దర్శకుడు అశ్వి న్. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లాంటి ప్రముఖులు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. కచ్చితంగా థియేటర్స్​లోనే విడుదల చేస్తామంటున్నారు.

Tagged movie, title, First look, "akashvani", curiacity, director ashvin, interesting, kalabhairava music, poster release

Latest Videos

Subscribe Now

More News