హైదరాబాద్‌ చేరుకున్న అక్బరుద్దీన్.. ఆదివారం ప్రజల ముందుకు

హైదరాబాద్‌ చేరుకున్న అక్బరుద్దీన్.. ఆదివారం ప్రజల ముందుకు

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన లండన్ నుంచి ఈ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. అభిమానులు, మజ్లిస్ పార్టీ కార్యకర్తలు అక్బరుద్దీన్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.

2011లో పాత కక్ష్యలతో రౌడీ షీటర్ పహిల్వాన్… అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపాడు. అప్పటినుంచి పలుమార్లు అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యంతో ఇబ్బందిపడ్డారు. బుల్లెట్ గాయం తీవ్రం కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన లండన్ వెళ్లారు అక్బరుద్దీన్ ఒవైసీ. రెండు నెలల పాటు అక్కడ చికిత్స తీసుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ తిరిగొచ్చారు.

ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వస్తూ.. ఉల్లాసంగా కనిపించిన అక్బరుద్దీన్ కు అభిమానులు స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న తన ఇంటికి వెళ్లారు అక్బరుద్దీన్ ఒవైసీ. తీవ్రమైన సమస్యతో ఇబ్బంది పడిన తనను… అభిమానుల ప్రార్థనలే బతికించాయని సన్నిహితులతో అక్బర్ చెప్పినట్టు సమాచారం.  కనీసం రెండు రోజుల రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో… ఆయన ఆదివారం ప్రజల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30న అక్బరుద్దీన్ ప్రజల ముందుకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.