
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’. నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళా, హిమాలయాలతోపాటు జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుగుతోంది. చింతూరు మండలం మోతుగూడెంలోని నదీ ప్రవాహం వద్ద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో టీమ్ అంతా పాల్గొంటున్నారు. నెక్స్ట్ షెడ్యూల్‌ను ప్రయాగరాజ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్‌తో దాదాపు చిత్రీకరణ పూర్తవనుందని తెలుస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం కావడంతో అంచనాలు
ఏర్పడ్డాయి.