బాలయ్య "అఖండ" రివ్యూ

బాలయ్య  "అఖండ" రివ్యూ

నటీనటలు: బాలకృష్ణ,ప్రగ్యా జైస్వాల్,శ్రీకాంత్,జగపతిబాబు,పూర్ణ,సుబ్బరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ:సి.రాంప్రసాద్
మ్యూజిక్: తమన్
మాటలు : ఎం.రత్నం
నిర్మాత: మిరియాల రవీందర్ రెడ్డి
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: బోయపాటి శ్రీను

కథేంటి?
అనంతపురం జిల్లాలోని ఓ ఊర్లో మురళీ కృష్ణ (బాలకృష్ణ) మంచి రైతుగా ఎదుగుతాడు.ప్రజల పక్షాన పోరాడుతుంటాడు. కలెక్టర్ శ్రావణి (ప్రగ్యా జైస్వాల్) ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ ఊరి పక్కన యూరేనియం మైనింగ్ వ్యాపారం చేస్తూ ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తుంటాడు శ్రీకాంత్.ఎదిరించిన వాళ్లను చంపేస్తాడు.ఎదిరించిన మురళీ కృష్ణ,శ్రావణి ఫ్యామిలీను చంపాలని చూస్తాడు.తర్వాత ఏమైంది.ఇంకో కొడుకు ఏమయ్యాడు.ఈ ఫ్యామిలీని కాపాడింది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 
నటీనటుల పర్ఫార్మెన్స్:
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు.ముఖ్యంగా అఖండ పాత్రలో చెలరేగిపోయాడు.అంతా తానే అయి నడిపించాడు.సెకండాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ లో విశ్వరూపం చూపించాడు.ప్రగ్యా జైస్వాల్ కు మంచి పాత్రే దక్కింది.శ్రీకాంత్ విలన్ పాత్రలో రాణించాడు.పూర్ణ తన పాత్ర కు న్యాయం చేసింది. కాలకేయ ప్రభాకర్,సుబ్బరాజు తదితరులు మెప్పించారు.
టెక్నికల్ వర్క్:
తమన్ మ్యూజిక్ సినిమా కు ప్రధాన బలం.పాటలు ఓకే అయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లకు ఎలివేషన్స్ ఇచ్చాడు.ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో దుమ్ములేపాడు.ఫ్యాన్స్ విజిల్ వేసేలా చేశాడు.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా గ్రాండ్ గా ఉంది.అన్ని లొకేషన్లను రిచ్ గా చూపించాడు.నిర్మాణ విలువలు వంక పెట్టలేకుండా ఉన్నాయి.నిర్మాత ఎక్కువ ఖర్చు చేసి సినిమాను ఎక్కడా రాజీపడకుండా తీసాడు.రత్నం డైలాగులు బాగా పేలాయి.
విశ్లేషణ:
‘‘అఖండ’’  ఊర మాస్ మసాలా మూవీ. కథ ఊహించిందే అయినా..దాన్ని బోయపాటి తనకున్న మాస్ పట్టుతో బాగా డిజైన్ చేశాడు. కథ,కథనాలు,లాజిక్ లు ఏవి పట్టించుకోకుండా బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం తీసాడు.సింహా,లెజెండ్  తర్వాత ఆ కాంబినేషన్ మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా తీసాడు. అందుకే అంత రక్తపాతం,భారీ యాక్షన్ ఎపిసోడ్లు.అయితే ఎంత ఫ్యాన్స్ కోసం తీసినా..కొద్దిగైనా లాజిక్ లు పాటించాలి. ఫస్టాఫ్ లెంగ్తీగా ఉంది.ప్రగ్యా జైస్వాల్ సీన్లు బోర్ కొట్టిస్తాయి.ఇంటర్వెల్ బ్యాంగ్ లో అఖండ వచ్చిన తర్వాత సినిమా ఊపందుకుంటుంది.సెకండాఫ్ లో కూడా ఇదే స్పీడు కంటిన్యూ అవుతుంది.కానీ అక్కడ మంచి సీన్లు,డ్రామా ఏం లేకుండా నరుక్కుంటూ పోవడం అతిగా అనిపిస్తుంది.చివరికి ఏం జరుగుతుందో ఫస్టాఫ్ లోనే తెలిసిపోతుంది కాబట్టి సెకండాఫ్ లో చెప్పటానికి ఏం లేదు.అందుకే ఆ ఊచకోత. ఫ్యాన్స్ వరకు ఆ యాక్షన్ ఎపిసోడ్ లు ఎంజాయ్ చేసినా.. ప్రేక్షకులు భరించటం సాహసమనే చెప్పాలి.ఓవరాల్ గా ‘‘అఖండ’’ బాలయ్య ఫ్యాన్స్ కు ,మాస్ ప్రేక్షకులకు నచ్చొచ్చు కానీ..సగటు ప్రేక్షకుడికి మాత్రం యావరేజ్ గా అనిపిస్తుంది.
బాటమ్ లైన్: హై వోల్టేజ్ మాస్