
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ యాక్షన్ లుక్స్‌తో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. శనివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. నిజానికి ఈ చిత్రం కిందటేడాదిలోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా ఏప్రిల్ 28 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఓ వీడియోతో ప్రకటించారు. ఈ యాక్షన్ గ్లింప్స్‌లో అఖిల్‌ని కుర్చీకి కట్టేసి, తలకు మాస్క్ కప్పారు. అతను పని చేస్తున్న ఏజెన్సీ గురించి అడిగినప్పుడు, ‘ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్’ అని సమాధానమిచ్చాడు. ముఖం అంతా రక్తంతో నిండి.. తనని తాను వైల్డ్ సాలే అని పిలవడం క్యూరియాసిటీని పెంచింది. ఇందులో అఖిల్ పొడవాటి, గిరజాల జుట్టుతో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ రాశాడు. హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.