అఖిలేష్తో మళ్లీ తెగదెంపులకు సిద్ధమైన శివపాల్

అఖిలేష్తో మళ్లీ తెగదెంపులకు సిద్ధమైన శివపాల్

యూపీ ఎన్నికలకు ముందు ఒక్కటైన బాబాయ్ అబ్బాయ్లు నెలలు గడవకముందే మళ్లీ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. అఖిలేష్ యాదవ్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న శివపాల్ యాదవ్ ఆయనతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. కొన్నాళ్ల క్రితం ఎస్పీ చీఫ్ అఖిలేష్తో భేటీ అయిన శివపాల్ పార్టీలో కీలక పదవి కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే బాబాయ్ డిమాండ్కు అఖిలేష్ నో చెప్పడంతో శివపాల్ అలిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో అఖిలేష్ సమావేశం ఏర్పాటు చేయగా.. దానికి శివపాల్ డుమ్మా కొట్టారు. అంతేకాదు.. ఎమ్మెల్యేగా అందరితో కలిసి కాకుండా విడిగా ప్రమాణం చేయడం అనుమానాలను మరింత పెంచింది. 

యూపీ ఎన్నిక‌ల సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ప్రగతిశీల సమాజ్ వాదీ ప్రెసిడెంట్ శివపాల్ యాదవ్ మధ్య పొత్తు కుదిరింది. అయితే పొత్తులో భాగంగా అఖిలేష్.. శివపాల్ కు ఒకే ఒక్క సీటు ఇవ్వడంతో అప్పట్లోనే ఆయన అలిగారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో ఎస్పీ ఓటమిపాలవడంతో అఖిలేష్, శివపాల్ మధ్య సంబంధాలు మరింత  దెబ్బతిన్నాయి. 

For more news..

లోక్ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు