లోక్ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్

లోక్ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ లోక్ సభలో విపక్ష నేతల ఆందోళనలు మిన్నంటాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసహనాన్ని వ్యక్తం చేస్తూ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్ష సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. గత 10 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.6.40 కి పెరగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేసినా విపక్ష నేతలు పట్టించుకోలేదు. 

మరిన్ని వార్తల కోసం

రతన్ టాటాకు భారతరత్న’ పిల్ ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు

అక్రమంగా కట్టిన రేప్ కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత