
బిగ్ బాస్ షోకు ( Bigg Boss Show) తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ బుల్లితెర షో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈసారి తెలుగు సీజన్ 9 ( Bigg Boss Telugu Season 9) మరింత భిన్నంగా ఉండబోతోందని నిర్వాహకులు తెలిపారు. 'ఈ సారి చదరంగం కాదు... రణరంగమే!' అంటూ సీజన్9కు అధికారిక ట్యాగ్‌లైన్‌గా ఉండబోతోంది. స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ షోకు ఈసారి కూడా నటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రొమోను కూడా రిలీజ్ చేశారు. మరో వైపు ఈ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియో వేదికగా జోరుగా జరుగుతున్నాయి.
ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్ ఇదే!
ఈ సారి కూడా బిగ్ బాస్ షోకు సామాన్యులకు తలుపులు తట్టింది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ ను నిర్వాహకులు విడుదల చేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోను మీరు ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు రిటర్న్ గిప్ట్ ఏమి ఇవ్వాలి. మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ లోకి ఎంట్రీయే రిటర్న్ గిప్ట్. ఈసారి బిగ్ బాగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలకే కాదు మీకు అవకాశం అంటూ సామాన్యులను ఉద్దేశించిన నాగార్జున ప్రొమోను నిర్వాహుకులు విడుదల చేశారు.
సామాన్యులకు ఎంట్రీ ఇలా..
ఇప్పటివరకు సామాన్యుల కోసం అప్లికేషన్లు తెరవగా ఎంట్రీలు లక్షల్లో వచ్చాయి. ఈ రెస్పాన్స్ చూసి షో నిర్వాహకులు షాక్ అయ్యారు. మీరు షోలో భాగం కావాలనుకుంటే, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు , ప్రయత్నించవచ్చు. మీరు ఎంపిక కావచ్చు. దీని కోసం bb9.jiostar.com వెబ్‌సైట్ ద్వారా కామన్ పీపుల్ అప్లై చేయవచ్చు. 3 నిమిషాల వీడియోతో మీ అర్హతను చూపించాల్సి ఉంటుంది.
హోస్ట్ గా అక్కినేని..
తెలుగులో బిగ్ బాస్ ఫోను 2019 నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈసారి కూడా ఆయనే హోస్ట్ గా అలరించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్9 సెప్టెంబర్ 7, 2025 ప్రారంభం కానుందని సమాచారం. ఈ సారి ఈ తెలుగు సీజన్9 లో ఎన్నో కొత్త ట్విస్ట్ లు, ఆసక్తికరమైన కంటెస్టెంట్లు, ప్రేక్షకులను ఆకట్టుకునే ఫార్మాట్స్ ఉండబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
కంటెస్టెంట్లు వీరే?
ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు ఎంట్రీ ఉంటుంది. అయితే పోటీదారుల ఎంపిక ఎప్పుడూ బిగ్ బాస్ కు కీలకం . ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నవారిలో కొన్ని ప్రముఖ పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో తేజస్విని గౌడ – టీవీ నటి, బిగ్ బాస్ 7 రన్నర్-అప్ అమర్ భార్య, కల్పిక గణేష్ – సినీ నటి , నవ్య స్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, ఇమ్మానుయేల్, అలేఖ్య చిట్టి, ముకేష్ గౌడ, సాయి కిరణ్, శ్రావణి వర్మ, RJ రాజ్, దెబ్జానీ, రీతూ చౌదరి, దీపికా, హరికా, ఈకనాథ్ తదితరులు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.