హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ 2019 లిస్ట్ ను విడుదల చేసింది ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ. హాలీవుడ్ స్టార్స్ తో పోటీపడి బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నాలుగో స్థానం సంపాదించడం విశేషం. 65 మిలియన్ యూఎస్ డాలర్స్ అంటే.. దాదాపు ఏడాదికి రూ.466 కోట్ల సంపాదనతో అక్కీ ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు.
మిషన్ మంగళ్ సక్సెస్ తో జోరుమీదున్న అక్షయ్ కుమార్ ఒక్కడికే ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి చోటు దక్కింది. రోబో 2.0తో భారీ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకున్న అక్షయ్.. మిగతా హిట్స్ , యాడ్స్, ఎండోర్స్ మెంట్లతో సంపాదనలో జోరు చూపించాడు.
హాలీవుడ్ స్టార్.. ది రాక్ గా పేరు తెచ్చుకున్న డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ యూఎస్ డాలర్స్ (రూ.640కోట్లు)తో టాప్ లో ఉన్నాడు. మార్వెల్స్ యూనివర్స్ సూపర్ హీరో, ఆస్ట్రేలియా నటుడు క్రిస్ హెమ్స్ వర్త్.. 76.4 మిలియన్ యూఎస్ డాలర్స్(రూ.547కోట్లు)తో రెండో స్థానం సంపాదించాడు.
రాబర్ట్ డౌనీ జూనియర్ 66 మిలియన్ యూఎస్ డాలర్స్ (రూ.473 కోట్లు) తో థర్డ్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఐరన్ మ్యాన్ రోల్ పోషించినందుకే… 20 మిలియన్ డాలర్స్ (రూ.143కోట్లు) దక్కించుకున్నాడని ఫోర్బ్స్ తెలిపింది.
ఐదో స్థానం జాకీచాన్ 58 మి.డా.(రూ.415కోట్లు)
ఆరో స్థానం(ఇద్దరికి కలిపి) బ్రాడ్లీ కూపర్ – ఆడమ్ సాండ్లర్ – 57 మి.డా. (రూ.407కోట్లు)
8వ స్థానం క్రిస్ ఎవన్స్ -43.5మి.డా.(రూ.311కోట్లు)
9వ స్థానం పాల్ రుడ్ – 41మి.డా.(రూ.293కోట్లు)
10వ స్థానం విల్ స్మిత్ – 35 మిలియన్ యూఎస్ డాలర్స్(దాదాపు రూ.250కోట్లు).
జూన్ 2018 నుంచి.. జూన్ 2019 వరకు… టాప్ హీరోల సంపాదనను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ లిస్ట్ ను ప్రకటించింది.
