జీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

జీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

ముషీరాబాద్, వెలుగు: కూలీల పని హక్కులను కాలరాసే జీరామ్​జీ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందించి ఉపాధి కూలీల హక్కులను పరిరక్షించాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సేవ్ నరేగా తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఈ మేరకు తీర్మానం చేశారు. 

సదస్సులో విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరు మురళి మాట్లాడుతూ.. పేదల సంక్షేమ పథకాలను బీజేపీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు పని హక్కును కల్పించిందని, అలాంటి చట్టాన్ని బలహీనపరచడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని అన్నారు. 

వంద రోజుల పనికి బదులుగా 125 రోజుల హామీ ఇస్తామని చెప్పి కూలీలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సామాజిక తనిఖీ విభాగం మాజీ డైరెక్టర్ సౌమ్య మాట్లాడుతూ.. జీరామ్​జీ  చట్టాన్ని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొత్త చట్టం ద్వారా కేంద్రం తన ఆర్థిక బాధ్యతను తగ్గించి రాష్ట్రాలపై అదనపు భారం మోపుతోందని ఆరోపించారు. 

డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ జీరామ్​జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. కార్యక్రమంలో పీపుల్స్ మానిటరింగ్ రాష్ట్ర కన్వీనర్ శివలింగం, టీవీవీయూ నాయకులు నర్సింలు, పద్మ, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకురాలు మీరా సంఘమిత్ర, సామాజిక కార్యకర్తలు డాక్టర్ ఉషా సీతలక్ష్మి, అఖిల్ సూర్య పాల్గొన్నారు.