
ఖైరతాబాద్, వెలుగు: రాజ్యాంగస్ఫూర్తితో పాలన జరగాలని రిజైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘దళిత ఉపకులాల సమస్యలపరిష్కారానికై’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రౌండ్ టేబుల్‌సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆకునూరి మురళి హాజరై, మాట్లాడారు.
అంబేద్కర్భావజాలానికి కొందరు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. కుల గణన సాధ్యం కాదని చెప్పిన బీజేపీకి మంద కృష్ణ మాదిగ ఎందుకు సపోర్టు చేశారని ప్రశ్నించారు. ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ నునిర్వీర్యం చేసిందని.. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు.
సమస్యలు చెప్పుకోవడానికి చట్టసభల్లో తమ నాయకుడు ఒక్కరు కూడా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.దళిత బంధు, డబుల్బెడ్రూమ్ ఇండ్ల పథకం ఏ ఒక్కరికి అందలేదన్నారు. ఎస్సీ ఉపకులాలకు కుల ధ్రువీకరణ పత్రం తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదస్సులో రచయిత వేణు, డీబీఎఫ్ నేత పి.శంకర్, నిరగొండ బుచ్చన్న గోసంగి, రాయిల లక్ష్మీ నర్సయ్య చిందు తదితరులు పాల్గొన్నారు.