ముత్తాత వయస్సులో.. 29 ఏళ్ల అమ్మాయితో.. బిడ్డను కన్న హీరో

ముత్తాత వయస్సులో.. 29 ఏళ్ల అమ్మాయితో.. బిడ్డను కన్న హీరో

హాలీవుడ్ లెజెండ్, అకాడమీ అవార్డు గ్రహీత అల్ పాసినో 83 ఏళ్ళ వయసులో మళ్లీ తండ్రి అయ్యారు. తన 29 ఏళ్ల స్నేహితురాలు నూర్ అల్ఫాల్లాతో కలిసి బిడ్డను కన్నారు. ఈ బిడ్డకు వారు రోమన్ పసినో అనే పేరును కూడా పెట్టారు. పాసినో మే చివర్లో తన నాలుగో బిడ్డ త్వరలోనే భూమి మీదకు రానున్నాడని తెలిపారు. కానీ అల్ఫాల్లా మాత్రం తల్లి కావడం ఇదే మొదటిసారి.

అల్ పాసినో ఇంతకుముందు డి'ఏంజెలోతో కలిసి ఇద్దరు కవల పిల్లలు ఆంటోన్, ఒలీవియాలకు తండ్రి కాగా, ఆ తర్వాత అంటోన్ తో కలిసి జూలీ మేరీ అనే కుమార్తెను కలిగి ఉన్నాడు. పాసినో, అల్ఫిల్లా ఏప్రిల్ 2022నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్నట్టు తెలిపే ఓ ఫొటో బయటికి రావడంతో వీరిపై సోషల్ మీడియాలో పలు రూమర్స్ క్రియేట్ అయ్యాయి.

అల్ పాసినో 'ది గాడ్‌ఫాదర్' సిరీస్, 'సెర్పికో', 'స్కార్‌ఫేస్', 'ది ఐరిష్‌మాన్' వంటి నోయిర్ క్రైమ్ చిత్రాలలో భిన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అల్ఫిల్లా 2017లో లాస్ ఏంజెల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువును కొనసాగించారు. అంతకు ముందు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా సినిమాటిక్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత ఆమె సినీ, టీవీ నిర్మాణంలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారు.