సంక్రాంతికి బన్నీ.. చేతిలో కోడి పుంజు

సంక్రాంతికి బన్నీ.. చేతిలో కోడి పుంజు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో  అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూవీ అలా వైకుంఠపురములో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జనవరి 12,2020 న సినిమా రిలీజ్ చేస్తున్న మూవీ టీం ప్రకటించింది. మాస్ లుక్ లో ఉన్న అల్లు అర్జున్ లుక్ ను ఒకటి రిలీజ్ చేశారు.  ఇందులో అల్లు అర్జున్ ఒక చేత్తో కోడి పుంజు మరో చేత్తో కత్తి, నోట్లో సిగరేట్, తలకు పాగా కట్టుకుని స్టైలీష్ గా మాస్ లుక్ తో ఉన్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన  సామజవరగమనా అనే సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.