అల్కరాజ్, రబ్లెవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోణీ

అల్కరాజ్, రబ్లెవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోణీ

 పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మూడో సీడ్ కార్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్ఫియా, ఆరో సీడ్ ఆండ్రీ రబ్లెవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–1, 6–2, 6–1తో జె.జె. వోల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రబ్లెవ్ (రష్యా)6–2, 6–7 (3/7), 6–3, 7–5తో  టరో డానియెల్ (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. పదో సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–4, 6–3, 6–4తో కొవసెవిచ్ (అమెరికా)ను ఓడించి ముందంజ వేశాడు. 

కానీ, 17వ సీడ్ లోకల్ స్టార్ యుగో హంబర్ట్ 4–6, 6–2, 4–6,3–6తో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొరెంజో సెనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాక తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కష్టంగా దాటింది. ఒసాకా 1–6, 6–4, 7–5తో లూకా బ్రాంజెటి (ఇటలీ)పై నెగ్గింది. తొమ్మిదో సీడ్ జెలెనా ఓస్తపెంకో (లాత్వియా) 6–4, 7–5తో జాక్వెలియన్ క్రిస్టియన్ (రొమేనియా)పై గెలిచి రెండో రౌండ్ చేరింది.