మందు మానలేక గొంతు కోసుకుని డాక్టర్ సూసైడ్
V6 Velugu Posted on Sep 29, 2021
ఖైరతాబాద్, వెలుగు: మద్యం మానేసేందుకు ప్రయత్నించి విఫలమవడంతో ఆర్ఎంపీ ఒకరు సూసైడ్ చేసుకున్నాడు. సిర్పూర్ కాగజ్ నగర్ జిల్లాకు చెందిన కోడిపుంజుల శ్రీనివాస్ కు ఐదేండ్ల క్రితం వివాహం అయ్యింది. బాబు పుట్టాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుండడంతో బంధువుల సహాయంతో కౌన్సెలింగ్ తీసుకొని మద్యానికి దూరంగా ఉన్నాడు. కానీ మానసికంగా కుంగిపోయాడు. స్థల మార్పిడి కోసం హైదరాబాద్ సిటీకి వచ్చి జవహర్‌నగర్‌లోని బామ్మర్ది వద్ద ఉంటున్నాడు. ఈ నెల 11న బాత్రూంకని వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించగా మంగళవారం మృతిచెందాడు.
Tagged Hyderabad, alcohol addiction, Doctor suicide, RMP doctor